న్యూఢిల్లీ: ప్రధాని పదవికి పోటీ పడుతున్న నరేంద్ర మోడీది ఏ పార్టీ? ఆయన ప్రత్యర్థి రాహుల్ గాంధీ ఏ పార్టీ నేత?.. అని మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారు? గట్టిగా నవ్వేసి, అయ్యో, ఇవేం పిచ్చి ప్రశ్నలు! వీటికి సమాధానాలు తెలియందెవరికి ! మోడీ ది బీజేపీ, రాహుల్‌ది కాంగ్రెస్ అని అంటారు కదా. కానీ ‘ఆప్’ మాత్రం మరోలా అంటుంది.
వీరందరూ తమ పార్టీ వారేనని ఢంకా బజాయిస్తుంది. వీరు మాత్రమేనా.. జాతిపిత మహాత్మాగాంధీ, ‘మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ’, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, చివరకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, హాలీవుడ్ తారలు జూలియా రాబర్ట్స్, బ్రాడ్‌పిట్, ఏంజెలినా జోలీ కూడా తమ సభ్యులేనని, ఇటీవలే తమ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని చెబుతోంది! కొంతమంది ఆకతాయిల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సభ్యుల జాబితాలో ఈ వింతలూ, విచిత్రాలూ ఉన్నాయి. అందులోని కొన్ని..
హా ఆప్‌లో చేరిన రాహుల్ ఇంటి చిరునామా ‘12, తుగ్లక్ లేన్, ఢిల్లీ’(ఇది సరైన చిరునామానే)
హా మరో సభ్యుడు బరాక్ ఒబామా తూర్పు ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆయన చిరునామా ‘వైట్‌హౌస్, వైట్‌హౌస్ డీసీ’.
హా ‘వందేళ్ల’ వయసున్న జవహర్‌లాల్ నెహ్రూ పార్టీలో అత్యంత పెద్దవయస్కుడు. ఆయన వీవీఐపీ నంబరు 1010101010.
ఆప్‌లో చేరిన రాహుల్, మోడీ!
Published Sat, Jan 25 2014 1:38 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement