
రాజీవ్ గాంధీకి మోదీ సెల్యూట్
మాజీ ప్రధాని రాజీవ్గాంధీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా నివాళులర్పించారు.
మాజీ ప్రధాని రాజీవ్గాంధీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా నివాళులర్పించారు. 1991 సంవత్సరంలో ఎల్టీటీఈ ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో మరణించిన రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని తన ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.
తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాద మానవబాంబు హతమార్చిన విషయం తెలిసిందే. కాగా రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 నుంచి 1989 డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు.
Paying tributes to former Prime Minister Shri Rajiv Gandhi on his death anniversary.
— Narendra Modi (@narendramodi) May 21, 2015