నోట్ల మార్పిడిలో రాజకీయ నాయకుల కొత్త ఎత్తులు
నోట్ల మార్పిడిలో రాజకీయ నాయకుల కొత్త ఎత్తులు
Published Thu, Nov 17 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
ముంబై : బ్లాక్మనీపై ఉక్కుపాదం మోపుతూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో, రాజకీయ నాయకులు పాతనోట్ల మార్పిడికి దొడ్డిదారులను ఎంచుకుంటున్నారు. లెక్కకు మించి ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహకార బ్యాంకుల్లో లోపాలను వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. బ్యాంకులు సైతం వారికి సహకరిస్తున్నాయి. పూర్తిగా కంప్యూటీకరణ కానీ సహకార బ్యాంకులు, ఇప్పటికీ ఫిజకల్ లెడ్జర్ బుక్స్ ద్వారానే కార్యకలాపాలు చేస్తున్నాయి.దీన్ని అవకాశంగా మార్చుకున్న కొందరు గడువు అయిపోయిన ఫిక్స్డ్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్లు, పే ఆర్డర్ల ద్వారా పాత నోట్లను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
దీని ద్వారా రాజకీయ నాయకులు ఎక్కువగా లబ్దిపొందుతున్నట్టు తెలుస్తోంది. సహకార బ్యాంకుల్లోని ఈ లోపాలే వీరికి అవకాశంగా మారుతున్నట్టు బ్యాంకింగ్ సెక్టార్లోని అధికారులంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అన్ని బ్యాంకులు కొత్త నోట్ల జారీలో నిమగ్నమై ఉన్నాయని, కానీ ఈ బ్యాంకులైతే లెక్కలో చూపని నగదు కోసం సహకరిస్తున్నారని కొందరు బ్యాంకర్లు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా వారి దగ్గరున్న పాత నోట్లను ఇతర బ్యాంకుల్లో మార్చుకోవడం కుదరక, సహకార బ్యాంకుల ద్వారా మార్చుకుంటున్నట్టు తెలిపారు. మార్చి 31 తర్వాత కోపరేటివ్ బ్యాంకులు జారీచేసిన డీడీలను, పే ఆర్డర్లను క్యాన్సిల్ చేసి, ఈ హోల్డర్స్కు కొత్త నోట్లలో నగదును చెల్లించనున్నట్టు తెలుస్తోంది.
Advertisement