అధిక రక్తపోటుకు కొత్త కారణం
లండన్: అధిక రక్తపోటుకు ఆల్డో స్టిరోన్ మాత్రమే కారణం కాదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. హైబీపీ రోగుల్లో వినయ గ్రంథి ఆల్డో స్టిరోన్ అనే ద్రవాన్ని అధికంగా విడుదల చేస్తుంది. ఈ స్థితినే కాన్ సిండ్రోమ్‌గా పిలుస్తారు. ఈ స్థితిలో ఉన్న వారిపై బర్మింగ్‌హామ్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అనేక మంది రోగుల్లో ఆల్డో స్టిరోన్‌తో పాటు స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ కూడా విడుదల కావటం వారు గమనించారు. ఈ స్థితిని కాన్షింగ్ సిండ్రోమ్‌గా నామకరణం చేశారు.
ఆల్డో స్టిరోన్ కంటే కార్టిసోల్ కారణంగానే టైప్–2 డయాబెటిస్, డిప్రెషన్, ఆస్టియోపోరసిస్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని శాస్త్రవేత్త వీబ్కే ఆర్లట్ తెలిపారు. తమ పరిశోధనలు కొత్త చికిత్సకు నాంది పలకనున్నాయని, ఇక నుంచి రోగులు ఏ స్థితిలో ఉన్నారో నిర్థారించుకొని చికిత్స చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని జెసీఐ ఇన్‌సైట్ జర్నల్ ప్రచురించింది.