కిడ్నాప్కు గురైన పసికందు ఆచూకీ లభ్యం | Nizamabad police is cleared girl child case | Sakshi
Sakshi News home page

కిడ్నాప్కు గురైన పసికందు ఆచూకీ లభ్యం

Published Tue, Aug 18 2015 9:51 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

కిడ్నాప్కు గురైన పసికందు ఆచూకీ లభ్యం

కిడ్నాప్కు గురైన పసికందు ఆచూకీ లభ్యం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పసికందు అదృశ్యమైన కేసును నిజామాబాద్ పోలీసులు మంగళవారం చేధించారు. వివరాలు.. ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 7 రోజుల ఆడ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ మాయమైందని తల్లి, కుటుంబసభ్యుల ఆందోళనకు దిగడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో బోధన్‌కు చెందిన అనీషా బేగం, నందిపేటకు చెందిన సుజాత కలిసి పథకం ప్రకారం ఎత్తుకెళ్లినట్లు తెలుసుకుని వారిని పట్టుకున్నారు. వారి నుంచి పాపను స్వాధీనం చేసుకుని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. సంతానం లేకపోవటంతోటే సుజాతఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement