పని చేయని మోదీ మ్యాజిక్ | no modi magic in own constituency | Sakshi
Sakshi News home page

పని చేయని మోదీ మ్యాజిక్

Published Mon, Jan 12 2015 7:59 PM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

no modi magic in own constituency

ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజక వర్గ పరిధిలో జరిగిన  కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన ఏడు స్థానాల్లోనూ ఇండిపెండెంట్ల చేతుల్లో ఓడిపోయారు.
 
దేశం మొత్తం మోదీ హవా కొనసాగుతుందన్న బీజేపీ శ్రేణులకు...మోదీ సొంత నియోజక వర్గంలోనే ఆయన మ్యాజిక్ పని చేయక పోవడం మింగుడు పడటం లేదు.  కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో నియోజకవర్గ పరిధిలో జరిగిన  కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లోనూ బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. 
 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయంలోనే బీజేపీ ప్రముఖులు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో ఇలాంటి ఫలితాలు రావడం కాషాయ వర్గాల్లో కలవరం తెప్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement