చల్లారని అద్వానీ | No one is upset, Sushma says after meeting Advani | Sakshi
Sakshi News home page

చల్లారని అద్వానీ

Published Sun, Sep 15 2013 2:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

No one is upset, Sushma says after meeting Advani

న్యూఢిల్లీ: అద్వానీ కోపం చల్లారడం లేదు. మోడీని ప్రధాని రేసులో నిలపడంతో భగ్గుమంటున్న ఆయనను శాంతింపజేసేందుకు పార్టీ సీనియర్ నేతలు శనివారం ప్రయత్నించారు. సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, రవిశంకర్ ప్రసాద్, బల్బీర్ పుంజ్‌లు శనివారమిక్కడ అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అద్వానీ రాజ్‌నాథ్‌కు రాసిన లేఖ చర్చకు వచ్చినట్లు తెలిసింది. మోడీ విషయంలో ఎవరికీ అసంతృప్తి లేదని సుష్మా భేటీ తర్వాత విలేకర్లతో అన్నారు. అద్వానీ వైఖరి ఏమిటని అడగ్గా ఈ విధంగా బదులిచ్చారు.  అయితే మోడీపై పార్టీ నిర్ణయం పట్ల అద్వానీ అసంతృప్తి వీడలేదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement