సీమాంధ్రలోనూ గెలుస్తాం
తాజా పరిస్థితులను దిగ్విజయ్‌కి వివరించా
సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరా
కిరణ్ పార్టీపై చర్చ అనవసరం
దిగ్విజయ్‌తో భేటీ అనంతరం బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులు, సీమాంధ్ర అభివృద్ధి తదితర అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో చర్చించినట్టు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. విభజనవల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ మనుగడకు ఢోకా ఉండదన్నారు. కాలం మార్పు తెస్తుందని, అయితే వచ్చిన మార్పు అభివృద్ధి కోసమే అని నిరూపించగలిగితే కాంగ్రెస్‌పార్టీ విజయం ఖాయమని చెప్పారు. ఆయన సోమవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...
రాష్ట్ర విభజనతో సీమాంధ్రుల్లో నెలకొన్న ఆందోళనలు పొగొట్టడంతోపాటు పార్టీపరంగా వారిలో నమ్మకం కలిగించడం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సీమాంధ్రకు ఇవ్వనున్న రాయితీలు, రైతుల సమస్యలు, పోలవరం ప్రాజెక్టుతో సహా పలు కీలక అంశాలు దిగ్విజయ్ దృష్టికి తెచ్చాను. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని కోరాను.
సీమాంధ్రలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై కేంద్రమంత్రులు, సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలతోసహా ముఖ్యనేతలందరితోనూ చర్చిం చాలని కోరాను. ఈ మేరకు మంగళవారం ఢిల్లీకి రానున్న సీమాంధ్ర నేతలతో దిగ్విజయ్ భేటీకానున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎంగా చేయగల సమర్థులైన నాయకులు పార్టీలో ఎందరో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్‌పార్టీకి ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడతారో లేదో ఇంకా తె లియనప్పుడు దానిపై చర్చించడం అనవసరం.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాపులను బీసీల్లో చేర్చాలన్న అంశంపై సోమవారం సోనియాగాంధీని కలిసి మరోమారు విజ్ఞప్తి చేశాను.
కాంగ్రెస్‌పార్టీలో టీఆర్‌ఎస్ విలీనం, పొత్తులు తదితర అంశాలను పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. దానిలో పీసీసీ అధ్యక్షుడికి ఎలాంటి పాత్ర ఉండదు. పార్టీ నిర్ణయాన్ని రాష్ట్ర శాఖ అనుసరిస్తుందంతే.