KTR: Telangana Minister KTR Overwhelmed With Love Of AP Leaders - Sakshi
Sakshi News home page

ఏపీ సోదరాభిమానానికి పొంగిపోయా.. వీడియో పోస్ట్​ చేసిన తెలంగాణ మంత్రి

Published Sat, Feb 12 2022 1:16 PM | Last Updated on Sat, Feb 12 2022 6:23 PM

Telangana Minister KTR Overwhelmed With Love Of AP Leaders - Sakshi

తెలుగు రాష్ట్రాలుగా భౌగోళికంగా విడిపోయినా.. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని అంటున్నారు టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, తెలంగాణ మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ కుమారుడు సందీప్ వివాహానికి కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. 

ఈ వేడుక‌లో ఏపీ రాజకీయ ప్రముఖులతో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు కాంగ్రెస్ నాయ‌కులు శ్రీధ‌ర్ బాబు, సుద‌ర్శన్ రెడ్డి పాల్గొన్నారు. నూత‌న వ‌ధూవ‌రులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడ సందడి నెలకొంది. ముఖ్యంగా కేటీఆర్​ రాజకీయ విభేధాలు పక్కనపెట్టి అందరు రాజకీయ ప్రముఖులతో కలివిడిగా, నవ్వుతూ మాట్లాడుతూ.. అక్కడికి వచ్చిన వాళ్లకు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ పోయారు.


ఏపీ మంత్రులు, నేతల నుంచి లభిస్తున్న సోదర ప్రేమకు ఎంతో పొంగిపోయానని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్​ చేశారు. నిన్న ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి వెళ్లాను. వారి నుంచి లభించిన ప్రేమాభిమానాలు చూసి పొంగిపోయాను ట్వీట్​ చేశారు కేటీఆర్​. ఒకవైపు బీజేపీ విభజన అన్యాయంగా జరిగిందని దుమారం రేపిన వేళ.. ఇరు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా టీఆర్​ఎస్​ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్ ట్వీట్​ ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement