
అతనిలా ఎవరూ డ్యాన్స్ చేయలేరు: హీరోయిన్
‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ దిశా పాట్ని గుర్తుంది కదా! ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రఫ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. వీరు లోతైన స్నేహంలో మునిగిపోయినట్టు బాలీవుడ్‌లో చెప్పుకొంటున్నారు.
ప్రస్తుతం టైగర్ ష్రఫ్‌తో కలిసి ‘బేఫిక్రా’ సినిమాలో నటించిన దిశా పాట్ని అతనిలా ఎవరూ డ్యాన్ చేయలేరని కితాబిస్తోంది. ‘టైగర్ పక్కన నిలబడటం, అతనితో కలిసి డ్యాన్స్ చేయడం చాలా గొప్ప విషయం. అతను డ్యాన్ చేస్తుంటే.. అతను తప్ప ఎవరూ కనిపించరు. అతనితో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అతని పక్కన నేను డ్యాన్స్ చేయడం ఫన్నీగా కనిపించకూడాదని కోరుకుంటున్నా’ అని దిశా పేర్కొంది. అతని డ్యాన్స్ వీడియోలు చూసి తాను అతనిలా స్టెప్పులు వేసేందుకు ప్రయత్నించేదానినని, కానీ అలా స్టెప్పులు వేయడం సాధ్యపడకపోయేదని దిశా అంటోంది. టైగర్ నుంచి లభించిన సహాయసహకారాలు, స్ఫూర్తి వల్లే అతని పక్కన చక్కగా తాను డ్యాన్ చేయగలిగానని, అతనితో పనిచేయడం ఎంతో సరదాగా ఉంటుందని దిశా పాట్ని చెప్పింది.