జమ్మూ కశ్మీర్: తనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో ఉత్తర కశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం రాత్రి పోలీసుల తనిఖీల్లో భాగంగా బరముల్లా-శ్రీనగర్ హైవేపై ఉగ్రవాదులు పయనిస్తున్న తవేరా వాహనాన్ని ఆపిన క్రమంలో వారు తమ వద్ద నున్న తుపాకీలతో రెచ్చిపోయారు.
ఉగ్రవాదులు అక్కడ్నుంచి తప్పించుకునే క్రమంలో తమవద్దనున్న తుపాకీలతో కాల్పులకు దిగారు.ఈ ఘటన రాత్రి గం.9.15 ని.లకు చోటు చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. తాము తనిఖీలు నిర్వహించే క్రమంలో తవేరా వాహనాన్ని ఆపుతుండగా అందులో ఉన్న ఉగ్రవాదుల్లో ఇద్దరు కాల్పులకు దిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. దీంతో ఉత్తర కశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు.