
'మద్దతు కావాలంటే మా ఇంటికి రండి'
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నుంచి తమకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. తన నివాసంలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నానని, తమ మద్దతు కావాలనుకునే వారెవరైనా తనను సంప్రదించవచ్చని చమత్కారంగా చెప్పారు. తన నివాసం 'మాతృశ్రీ'లో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఒకవేళ తాను బీజేపీని సంప్రదిస్తే ఎన్సీపీ మద్దతు తీసుకున్నామన్న సమాధానం రావొచ్చెమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తారా అని విలేకరుల ప్రశ్నించగా... మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదని పరోక్షంగా ఆయన సమాధానమిచ్చారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని చెప్పారు.