ఒక్క క్లిక్తో గాంధీజీ రచనలు.. | now online in Mahatma Gandhi writings | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్తో గాంధీజీ రచనలు..

Published Wed, Sep 9 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

ఒక్క క్లిక్తో గాంధీజీ రచనలు..

ఒక్క క్లిక్తో గాంధీజీ రచనలు..

ఇప్పుడు ఒక్క క్లిక్ తో గాంధీజీ రచనల వంద సంపుటాలు చదివెయ్యొచ్చు. ఢిల్లీలోని గాంధీజీ  పీస్ ఫౌండేషన్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ రాసిన వంద సంపుటాల కలెక్షన్ ను ప్రపంచ డిజిటల్ వేదిక సహాయంతో నెట్టింట్లో పొందు పరచారు. ఈ 'ఈ వెర్షన్' ను  ఢిల్లీలో కేంద్ర మంత్రి  అరుణ్ జైట్లీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో  ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచీ సేకరించిన మహాత్మా గాంధీ రచనలను, ఉత్తరాలను డిజిటల్ ఫార్మాట్ లోకి మలచి విజయవంతంగా పుస్తకాభిమానులకు అందుబాటులోకి తెచ్చారు.

సీడబ్ల్యూ ఎంజీ సిరీస్ ఛీఫ్ ఆర్కిటెక్ట్..  ప్రొఫెసర్ కె. స్వామినాథన్ మరికొందరు సంపాదకుల బృందం  ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సంకలనాల  మొత్తాన్ని సేకరించేందుకు 38 సంవత్సరాలు పట్టింది. దీనిలో మొత్తం 55 వేల పేజీలను పొందుపరిచారు. సీడబ్ల్యూయమ్జీ సంపాదకీయ బృందం... మహాత్మా గాంధీకి సన్నిహితంగా ఉండే వ్యక్తులను కనుగొని వారి వద్ద ఉన్న లేఖలను, గాంధీ వారితో జరిపిన సంభాషణలను సమర్పించమని విజ్ఞప్తి చేసింది. 2005 లో  సీడబ్ల్యూయమ్జీ సంపుటాల్లో 100 ఎంట్రీలు చేసినప్పటికీ.. . కొన్ని మిస్ అవడంతో అప్పట్లో మళ్ళీ  వారి ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. అనంతరం మిస్ అయిన సంపుటాలను, ఉత్తరాలను గాంధీజీ జర్మన్ స్నేహితుడు హెర్మాన్ కల్లెన్ బాక్ నుంచీ సేకరించారు. వీటిలోని లోపాలను  నిపుణుల బృందం సరిచేసి, వాటితోపాటు మిగిలిన అన్నింటిని ఐదు సంవత్సరాల్లో తప్పులను దిద్ది మొత్తం వంద వాల్యూమ్ లను పునరుద్ధరించారు.  ఈ సంపుటాలను సీడీ రూపంలో రాజ్యసభకు సమర్పించారు.

ఈ... ఈ ప్రాజెక్టుకు అహ్మదాబాద్ లోని గుజరాత్ విద్యాపీఠ్ మద్దతుతో సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ప్రచురణ విభాగం ప్రొఫెసర్ సుదర్శన్ అయ్యంగార్, గుజరాత్ విద్యాపీఠ్ మాజీ వైస్ ఛాన్సలర్ దీనాబెన్ పటేల్, ఓ ప్రముఖ గాంధేయ వాది, పండితుడు త్రిదీప్ సుహృద్, దర్శకుడు సబర్మతి ఆశ్రమ ప్రిజర్వేషన్, మెమోరియల్ ట్రస్ట్ నాయకత్వం వహించారు. ముగ్గురు సభ్యుల కమిటీ పర్యవేక్షణలో ఈ-వెర్షన్ ను డివిడిల రూపంలో విడుదల చేశారు.  మహాత్మాగాంధీ హెరిటేజ్ పోర్టల్ లోనూ ఇప్పుడు ఈ వంద సంపుటాలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement