న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌టీపీసీ చేపట్టిన పన్నుర హిత బాండ్ల విక్రయానికి 3.3 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయానికి ఉంచ గా, రూ. 3,300 కోట్ల విలువైన బిడ్స్ లభించాయి. నిజానికి ఇష్యూ ఈ నెల 16న ముగియాల్సి ఉన్నప్పటికీ అధిక స్పందన కారణంగా బుధవారం లాంఛనంగా ముగింపు పలకనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సమీకరణ లక్ష్యం రూ. 1,000 కోట్లతోపాటు, అదనంగా రూ. 750 కోట్ల మొత్తానికి బాండ్లను విక్రయించేందుకు కంపెనీకి వెసులుబాటు ఉంది.