భోపాల్: అధికమొత్తంలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెరాసియా రహదారిపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయగా రూ.2 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్ లభించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మధప్రదేశ్ లోని మన్ దీప్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అహ్మద్ ఖాన్(26) అనే వ్యక్తి 1.75 కిలో గ్రాముల మాదక ద్రవ్యాలను సోమవారం అక్రమంగా తరలించే యత్నంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. ఆ సమయంలో క్రైం బ్రాంచ్ పోలీసుల కంటబడిన అతని చేతిలో ఉన్న బ్యాగును తనిఖీ చేయగా భారీగా బ్రౌన్ షుగర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ మాదక ద్రవ్యాలను రాష్ట్రంలోని ఇతార్సి కి తరలిస్తున్నట్లు అతను పోలీసులకు తెలిపాడు. అయితే అతను చాలా కాలం నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.