బ్యాంకుల వద్దకు పారామిలటరీ బలగాలు
Published Thu, Nov 10 2016 12:13 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
పెద్ద నోట్ల రద్దు అనంతరం మూతపడిన బ్యాంకులు నేడు తెరుచుకున్నాయి. పాతనోట్లు వెనక్కి ఇచ్చేసి, కొత్త నోట్ల తీసుకోవడం కోసం జనాలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద ఎలాంటి సెక్యురిటీ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భారీగా పారామిలటరీ బలగాలు, డిల్లీ పోలీసు సిబ్బంది, క్విక్ రియాక్షన్ టీమ్స్ దేశరాజధానిలో మోహరించారు. జనాలతో బ్యాంకులు రష్గా ఉండటంతో పటిష్టం భద్రత కోసం ప్రభుత్వం వీరిని నియమించింది. 1,200 పారామిలటరీ సిబ్బంది, 2,200 ఢిల్లీ పోలీసుతో పాటు మరో 1,000 మందిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సత్వర చర్యలు కోసం పక్కన పెట్టింది.
ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే వారిని ప్రభుత్వం అక్కడికి పంపనుందని అధికార వర్గాలు తెలిపాయి. 200 సత్వర చర్యలు తీసుకునే టీమ్స్ను ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు పంపినట్టు పేర్కొన్నారు. బ్లాక్మనీని నిర్మూలించడానికి 500, 1000 పెద్ద నోట్లను రద్దు చేస్తూ మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ షాకింగ్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని నిర్ణయం అనంతరం నిన్న(బుధవారం) బ్యాంకులు పనిచేయలేదు. నేడు ఓపెన్ అయిన బ్యాంకులు కొత్త నోట్లను జారీచేస్తున్నాయి. పాతనోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, కొత్త నోట్ల కోసం బ్యాంకుల వద్దకు పరిగెత్తారు.
Advertisement