
జమ్మూకశ్మీర్ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు
జమ్మూ: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి పాకిస్థాన్, వేర్పాటువాదులు, తీవ్రవాదులు సహకరించారని వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్టాడారు.
వేర్పాటువాదులు, తీవ్రవాదులు సహకరించకుంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవి కాదని అన్నారు. వారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారని తెలిపారు. సయీద్ వ్యాఖ్యలను మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ఎన్నికలు జరిగేలా సహకరించినందుకు వేర్పాటువాదులు, తీవ్రవాదులకు ధన్యవాదాలు తెలపాలా అని ప్రశ్నించారు. సయీద్ వ్యాఖ్యలపై బీజేపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.