‘పాన్’కు పాత పద్ధతే! | PAN allotment norms put on hold | Sakshi
Sakshi News home page

‘పాన్’కు పాత పద్ధతే!

Published Fri, Jan 31 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

PAN allotment norms put on hold

న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను పొందేందుకు తాజాగా రూపొందించిన నిబంధనలను తాత్కాలికంగా పక్కన బెట్టినట్లు ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రకారమే పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. తాజా నిబంధన ప్రకారం దరఖాస్తుతో పాటు జతపరిచిన ధ్రువపత్రాల ఒరిజినల్స్‌ను కూడా పరిశీలన కోసం దరఖాస్తుదారులు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ నిబంధన ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతానికి ఆ నిబంధనను పక్కనబెట్టామని, గతంలో మాదిరిగానే అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతపరిస్తే సరిపోతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement