లగేజ్ బాధ లేకుండా ప్రయాణం..
పర్సనల్ లగేజ్.. ప్రయాణంలో తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన ఈ బరువును మోయడానికి లేదా లాక్కెళ్లడానికి(వీల్స్ బ్యాగ్) జనం నానా ఇబ్బందులు పడుతుంటారు. బస్లాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. ఒక్కసారి పరిశీలనగా చూస్తే మనతో సహా అందరూ లగేజ్ బాధితుల్లాగే అనిపిస్తారు. చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్లు.. లగేజ్ బ్యాగ్ లకు చక్రాలు, హ్యాండిల్స్ బిగింపుతో ప్రయాణం కొద్దిగా సౌకర్యవంతంగా మారినా.. ఇంకా ఏదో లోటు..!
ఆ లోటును పూడ్చగలిగిన అతి చిన్న వస్తువే ఈ 'మై హిచ్' ఏడెనిమిది అంగుళాల పొడవుండే ఈ ప్లాస్టిక్ కొక్కేన్ని ప్యాంట్ లోకి జొప్పించి, రెండో కొక్కేనికి బ్యాగ్ తగిలించుకొని మొబైల్ వినియోగించుకుంటూ హాయిగా నడవొచ్చు. మియామి(అమెరికా)కి చెందిన రాబర్ట్ లియాన్ అనే వ్యక్తి రూపొందించిన ఈ మై హిచ్ ధర కేవలం 18 డాలర్లు.