
నేనొస్తే ఇబ్బందనే రావట్లేదు
హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనపై సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘అక్కడికి వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నా.. దాని వల్ల మళ్లీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావడం విరమించుకున్నాను’ అని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.