'పెర్ డ్రాప్ మోర్ క్రాప్'
న్యూఢిల్లీ: నాణ్యతలో రాజీపడకుండా పంటల ఉత్పత్తులు పెంచేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పరిశోధనా ఫలాలు రైతులకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. 'పెర్ డ్రాప్- మోర్ క్రాప్' తమ విధానమని ప్రధాని స్పష్టం చేశారు.
రైతులను చైతన్యవంతులను చేసేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సొంతంగా రేడియో స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దిగుమతులపై ఆధారపడకుండా ఆయిల్ సీడ్స్, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నించాలన్నారు. నీలి విప్లవం ద్వారా చేపల వర్తకం పెంచేందుకు పాటు పడాలని మోడీ పిలుపునిచ్చారు.