బంజారాహిల్స్ (హైదరాబాద్) : హలీం కోసం క్యూ లైన్లో నుంచున్న పలువురి జేబులకు దొంగలు చిల్లులు పెట్టారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాల ప్రకారం... హబ్సిగూడకు చెందిన కె. వీరభద్ర పార్థ డెంటల్‌లో సర్వీస్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. హలీంకు ఆఖరి రోజు కావడంతో శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్‌నెం.1లోని సర్వీ హలీం కేంద్రం వద్ద క్యూలో నిల్చున్నాడు. కొద్దిసేపటికి చూసుకోగా ఖరీదైన సెల్‌ఫోన్ మాయమైంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా మెహిదీపట్నంకు చెందిన ఇస్మాయిల్ అనే విద్యార్థి హలీం కోసం క్యూలో నిల్చోగా పర్సు చోరీకి గురైంది. అందులో రూ.2 వేల నగదు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్‌కు చెందిన రాజశేఖర్ అనే యువకుడు కూడా హలీం కోసం క్యూలో నిల్చుని పర్సు పోగొట్టుకున్నాడు. ఇలా చాలామంది హలీం సెంటర్ల వద్ద పర్సులు, నగదు పోగొట్టుకున్నట్టు సమాచారం.
హలీం కోసం క్యూ : జేబు దొంగల హల్‌చల్
Published Sat, Jul 18 2015 5:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement