
ప్రధాని బసకు ఐదు కోట్లు.. అద్దె కార్లకు రెండు కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ విదేశీయానం ఖర్చు ఎంతో తెలుసా..! అక్షరాల రూ.37కోట్లు. ఇందులో అగ్రభాగం వ్యయం ఆస్ట్రేలియా పర్యటనకు అయింది. ఈ విషయం ఓ సమాచార హక్కు ఉద్యమకారుడు ద్వారా తెలిసింది. 2014 జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన విదేశీ పర్యటన మొత్తం వ్యయం ఎంత అని ప్రశ్నిస్తూ ఆర్టీఐ ద్వారా ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా దాని వివరాలు తెలిసింది.
ఏడాదికాలంలో మోదీ మొత్తం 20 దేశాల్లో పర్యటించారని వీటికోసం మొత్తం రూ.37.22కోట్లు ఖర్చయ్యాయని పేర్కొంది. వీటిలో అత్యధిక వ్యయం ఆస్ట్రేలియా, యూఎస్, జర్మనీ, ఫిజీ, చైనా దేశాలకు కాగా భూటాన్ పర్యటనకు మాత్రం రూ.41.33 లక్షలు అతి తక్కువగా ఖర్చయ్యాయని వివరించారు. వీటిల్లో హోటల్లలో బస ఖర్చు రూ.5.60 కోట్లు అని, అద్దె కార్లకు రూ.2.40 కోట్లు అని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.