ఆమ్‌స్టర్‌డమ్: అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత పోర్చుగల్‌లో పర్యటించిన ఆయన ఆ తర్వాత అమెరికాలో రెండు రోజుల పాటు పర్యటించారు. అక్కడ ఐటీ రంగ దిగ్గజాలు, ప్రవాస భారతీయులతో సమావేశమైన మోదీ కీలకమైన రెండో రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు.
తర్వాత నెదర్లాండ్స్‌కు వెళ్లారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఆయన ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అవుతారు. భారత్-డచ్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ డచ్‌లో పర్యటిస్తున్నారు.