ములాయంపై మోదీ ప్రశంసలు | PM Modi Praises Mulayam Singh, Who Broke Ranks With Congress | Sakshi
Sakshi News home page

ములాయంపై మోదీ ప్రశంసలు

Published Tue, Aug 11 2015 11:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ములాయంపై మోదీ ప్రశంసలు - Sakshi

ములాయంపై మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చిన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం ఉదయం తమ పార్టీకి చెందిన చట్ట ప్రతినిధులతో భేటీ అయిన మోదీ.. ములాయంను కొనియాడారు. పార్లమెంటును ప్రతిరోజూ స్తంభింపజేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించి ములాయం మంచి పని చేశారని అన్నట్లు అధికార వర్గాల సమాచారం.

కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం దేశ అభివృద్ధిని పార్లమెంటు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాన్ని ములాయం అడ్డుకున్నారని పరోక్షంగా మోదీ ప్రస్తావించినట్లు తెలిసింది. సోమవారం ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. పార్లమెంటులో ఆందోళన విరమించుకుంటే మద్ధతు ఉపసంహరించుకుంటామని, ఒంటరిగా మిగిలిపోతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement