'మోడీ మానవత్వాన్ని మట్టుబట్టే హంతకుడు'
అలహాబాద్: మానవత్వాన్ని మట్టుపెట్టే హంతకుడు అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలహాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ మైదానంలో జరిగిన సమావేశంలో ములాయం మాట్లాడుతూ...దేశ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణం అని అన్నారు.
గుజరాత్ లో సామూహిక హత్యలకు పాల్పడిన బీజేపీ.. రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు క్షమాపణలు చెబుతోంది అని ఆయన విమర్శించారు. ఉత్తర ప్రదేశ్ లో మోడీ కరిష్మా పనిచేయదని ఆయన జోస్యం చెప్పారు. గుజరాత్ లో కాలుష్యంతో నిండిన నదులు తప్ప అక్కడ అభివృద్దిలేదని ములాయం ఆరోపించారు. మైనార్టీలు, పేద ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ వద్ద ఎలాంటి విధానాల్లేవని ములాయం అన్నారు.