ప్రధాని నరేంద్ర మోదీ@ 65 | pm modi turns 65 | Sakshi
Sakshi News home page

ప్రధాని నరేంద్ర మోదీ@ 65

Published Thu, Sep 17 2015 1:43 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ప్రధాని నరేంద్ర మోదీ@ 65 - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ@ 65

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ 65 సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆయనకు ప్రపంచ దేశాలనుంచి దిగ్గజాలు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలని పేర్కొంటూ రష్యా ప్రధాని మెద్వదేవ్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్, జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికి తిరిగి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి భవన్ కూడా ప్రధానికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే, ప్రధాని తన జన్మదినం రోజే 1965నాటి ఇండియా-పాక్ యుద్ధానికి సంబంధించిన స్మారక మ్యూజియం శౌర్యాంజలిని సందర్శించారు. ఈ సందర్భంగా నాటి వీర జవానులను గుర్తుకు తెచ్చుకొని వారికి ప్రత్యేక అంజలి ఘటించారు. నేడు ఈ మ్యూజియంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ప్రారంభమయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement