
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ బయలుదేరేముందు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐర్లాండ్ లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కు బయలుదేరారు. ఆ దేశ ప్రభుత్వాధినేత (తెషెక్) ఎన్డా కెన్నీతో మోదీ సమావేశమవుతారు.
బుధవారం సాయంత్రం అక్కడి నుంచి న్యూయార్క్ బయల్దేరి వెళ్లేముందు.. ఐర్లండ్‌లోని భారత సంతతి ప్రజలతో మోదీ కొద్దిసేపు సమావేశమవుతారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతిపరిరక్షణపై ఐరాస సదస్సులో పాల్గొంటారు.