దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు | PM Shri @narendramodi greets the people on occasion of various festivals across the country | Sakshi
Sakshi News home page

దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు

Published Sat, Mar 21 2015 8:48 AM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM

దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు - Sakshi

దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన్మథ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉగాది పండగను వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు. పార్శి సోదరసోదరీమణులకు నవరోజ్ ముబారక్ అని తెలిపారు.  ఉగాదిని గౌడీ పాడ్వ పండగ పేరుతో జరుపుకునే మహారాష్ట్రీయులకు శుభాకాంక్షలు చెప్పారు. చెట్టి చాంద్ పేరుతో పండుగ జరుపుకునే సిందీలకు కూడా నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement