
పోస్టల్ స్టాంపుపై త్వరలో 'కలాం'
పాట్నా: దేశంలోని 25మంది మహనీయులను కేంద్ర ప్రభుత్వం గౌరవించనుంది. వారిపేరిట స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేయనుంది. వారిలో ఇటీవల పరమపదించిన భారత రత్న, ఇండియన్ మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం కూడా ఉండనున్నారు. ఈ విషయాన్ని యూనియన్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు బీహార్లో ప్రకటించారు. దేశానికి వారు అందించిన అత్యున్నత సేవలకు గుర్తింపుగా వారి పేరిట స్టాంపులు ముద్రించనున్నట్లు తెలిపారు.
సోమవారం ఆయన అశోకుడి పేరిట ఉన్న స్టాంపును విడుదల చేశారు. ఆయన ప్రకటించిన 25మందిలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సచ్చిదానంద సిన్హా, జై ప్రకాశ్ నారాయణ్, కార్పురి ఠాకూర్, కైలాస్ పతి మిశ్రా, మౌంటెయిన్ మ్యాన్ దశరథ్ మాంఝీ, రవీంధ్రనాథ్ ఠాగూర్, బాలగంగాధర్ తిలక్, శివాజీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, మదర్ థెరిసా, రామ్ మనోహర్ లోహియా, భిస్మిల్మా ఖాన్, రవిశంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మీ, సీపీఐ నేత భూపేశ్ గుప్తాతోపాటు ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఉన్నారు.