22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, రాజస్థాన్ సివిల్స్ సర్వీసెస్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఛైర్మన్ బి.బి.మహంతిని వసుంధర రాజే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మహంతిపై అత్యాచార ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ అంశంపై సమగ్ర విచారణ జరిపి, వెంటనే నివేదిక అందజేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నతాధికారులను గతంలో ఆదేశించారు.
ఆ ఘటనపై సంపూర్ణ విచారణ జరిపిన ఉన్నతాధికారులు నివేదికను రూపొందించి మంగళవారం సీఎంకు సమర్పించారు. దాంతో మహంతిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశించారు. అయితే అత్యాచారం కేసులో బుధవారం విచారణకు హాజరుకావాలని ఇప్పటికే రాజస్థాన్ పోలీసులు మహంతికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే బాధితురాలు వాంగ్మూలాన్ని పోలీసులు మంగళవారమే రికార్డు చేశారు.
అసలు ఏం జరిగింది?
తాను రాజస్థాన్ సివిల్స్ సర్వీసెస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బి.బి.మహంతి నిర్వర్తిస్తున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాస్ చేస్తానని ఆయన 22 ఏళ్ల యువతిని హమీ ఇచ్చాడు. ఆ అంశంపై జైపూర్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన స్వెజ్లోని తన నివాసంలో చర్చించేందుకు రావాలని ఆ యువతికి మహంతి సూచించారు. దాంతో ఆ యువతి మహంతి నివాసానికి వెళ్లింది. అక్కడ ఆమెపై మహంతి పలుమార్లు అత్యాచారం జరిపాడు. అనంతరం ఆ యవతిని వివాహం చేసుకుంటానని మహంతి వెళ్లడించాడు.
దాంతో ఇద్దరు కలసి భరత్పూర్, అగ్రా, గోవా, ఉదయ్పూర్ నగరాల్లో విహారించారు. ఆ తర్వాత ఇద్దరు జైపూర్ నగరానికి చేరుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ యువతి తన ఉద్యోగం గురించి మహంతిని ప్రశ్నించగా తనకేమి తెలియదని మాట మార్చాడు. దాంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించి, తనకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానానికి విన్నవించింది. దాంతో ఉన్నతాధికారి మహంతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
అందులో భాగంగా పోలీసులు యువతి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. అయితే ఆ యువతి ఆరోపణలకు సదరు ఐఏఎస్ అధికారి బి.బి .మహంతి ఖండించారు. యువతి ఆరోపణలు నిరాధారమైనవని ఆయన వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో తన కేసు తప్పుదొవ పట్టించేందుకు మహంతి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది.