’ధోనీ’ సినిమాలో ఆ క్రికెటర్‌గా రాంచరణ్‌!? | RAM CHARAN acts as Suresh Raina IN DHONI BIOPIC | Sakshi
Sakshi News home page

’ధోనీ’ సినిమాలో ఆ క్రికెటర్‌గా రాంచరణ్‌!?

Published Tue, Sep 27 2016 8:33 PM | Last Updated on Thu, Sep 12 2019 8:55 PM

’ధోనీ’  సినిమాలో ఆ క్రికెటర్‌గా రాంచరణ్‌!? - Sakshi

’ధోనీ’ సినిమాలో ఆ క్రికెటర్‌గా రాంచరణ్‌!?

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ’ఎంఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ’.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధోనీలాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కనిపిస్తుండగా ఆయనకు జోడీగా ’లోఫర్‌’ హీరోయిన్‌ దిశా పట్నీ నటిస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్‌ కోసం ధోనీ, సుశాంత్‌ దేశవ్యాప్తంగా తిరిగి విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 30న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్‌ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో క్రికెటర్‌ సురేశ్‌ రైనాలో మెగా హీరో రాంచరణ్‌ నటిస్తున్నాడట. ఇప్పటికే 'జంజీర్‌' సినిమాతో రాంచరణ్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తీవ్ర నిరాశ మిగిల్చినా బాలీవుడ్‌పై చరణ్‌ ఇంకా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే క్రికెటర్‌ పాత్రలో నటించినట్టు వినిపిస్తోంది. అయితే రాంచరణ్‌ కానీ, ఆయన ప్రొడక్షన్‌ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం రాంచరణ్‌ 'ధ్రువ' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోటీన్‌కు భిన్నంగా 'ధోనీ' సినిమాలో కనిపించాడని అంటున్నారు. చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నిజమో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement