సీఎం ఇంటి సమీపంలో యువతి మృతదేహం! | raped teen's deadbody found near up cm house | Sakshi
Sakshi News home page

సీఎం ఇంటి సమీపంలో యువతి మృతదేహం!

Published Wed, Feb 17 2016 7:57 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

సీఎం ఇంటి సమీపంలో యువతి మృతదేహం! - Sakshi

సీఎం ఇంటి సమీపంలో యువతి మృతదేహం!

వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి (17) మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో.. ముఖ్యమంత్రి అధికార నివాసానికి అత్యంత సమీపంలో దొరికింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పటిష్ఠమైన భద్రతతో ఉండే లోహియా పాత్ జోన్‌లో ఒకవైపు సీఎం అఖిలేష్ యాదవ్ నివాసం ఉండగా.. మరోవైపు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఉంటుంది. ఈ రెండింటికీ మధ్య అత్యాచారం, హత్యకు గురైన యువతి మృతదేహం కనిపించడం ఒక్కసారిగా పోలీసు యంత్రాంగాన్ని షాక్‌కు గురిచేసింది. ఈనెల 10వ తేదీన స్కూలుకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చివరకు యువతి మృతదేహం కనిపించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దాంతో డీజీపీ జావేద్ అహ్మద్ నేతృత్వంలో ఒక స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఆమె తలమీద బలమైన గాయం తగలడం వల్లే మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరం నగ్నంగా ఉండటం, అనేక గాయాలు కూడా ఉండటంతో దారుణంగా అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఆమె అదృశ్యమైన మర్నాడే అంటే.. 11వ తేదీనే దీపు అనే రిక్షా కార్మికుడికి ఆమె మృతదేహం కనిపించింది. అయితే ఎవరికీ చెప్పకుండా అక్కడున్న సెల్‌ఫోన్ మాత్రం తీసుకుని, దాన్ని తన భార్యకు ఇచ్చాడు. సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. అక్కడ ఓ చెట్టుకు స్కార్ఫ్‌తో మృతదేహం వేలాడుతూ ఉండగా చూశానని దీపు చెప్పాడు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లి చూస్తే మృతదేహం లేదు. దాంతో పోలీసు జాగిలాలను రప్పించి గాలించగా.. డ్రెయిన్‌లో మృదేహం లభ్యమైంది. 12 మంది డైవర్లు వెళ్లి ఆ మృతదేహాన్ని వెలికి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement