ఆర్‌బీఐ ప్రతిపత్తికి విఘాతం తగదు | RBI's autonomy should be kept intact: Manmohan Singh | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ ప్రతిపత్తికి విఘాతం తగదు

Published Sun, May 10 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

ఆర్‌బీఐ ప్రతిపత్తికి విఘాతం తగదు

ఆర్‌బీఐ ప్రతిపత్తికి విఘాతం తగదు

 న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్వయం ప్రతిపత్తికి ఎటువంటి విఘాతం కలగనీయరాదని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థిక మంత్రిత్వశాఖ- ఆర్‌బీఐ సన్నిహిత సహకారంతో కార్యకలాపాలు నిర్వహిం చాలని సూచించారు. ఆర్థికమంత్రిగా (1991-1996), ఆర్‌బీఐ గవర్నర్‌గా(1982-85) కూడా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
 
  వడ్డీరేట్లు, కేంద్రం బ్యాంక్ నుంచి కొన్ని అధికారాలను బదలాయించాలన్న ప్రతిపాదనలు తత్సం బంధ అంశాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ-ఆర్‌బీఐ మధ్య విభేదాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొ న్న మన్మోహన్ ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. అటు ఆర్థికశాఖ, ఇటు ఆర్‌బీఐ రెండూ అత్యున్నత ప్రాముఖ్యత గలిగిన విభాగాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ, వీటి మధ్య ఎటువంటి విభేదాలూ లేవని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే ప్రకటించిన విషయాన్నీ ప్రస్తావించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement