
'మంత్రి, ఎంపీ పదవులు వదులుకుంటా'
న్యూఢిల్లీ: తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిజమని రుజువైతే మంత్రి, ఎంపీ పదవులు వదులుకునేందుకు సిద్ధమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు తనను లక్ష్యంగా చేసుకుని సభా కార్యకలాపాలను స్తంభింపజేయడంతో ఆయన స్పందించారు.
గడ్కరీ కుటుంబానికి చెందిన కంపెనీపై కాగ్ ఇచ్చిన నివేదిక పార్లమెంట్ లో వచ్చినప్పుడు చర్చిద్దామని రాజ్యసభలో విపక్షాలకు ఆర్థిక అరుణ్ జైట్లీ సద్దిచెప్పారు. కొన్ని బిల్లులపై చర్చ జరగడం ఇష్టంలేకే కాంగ్రెస్ సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతోందని ఆయన ఆరోపించారు.
గడ్కరీ కుటుంబానికి చెందిన ప్యూరిటీ గ్రూప్‌నకు రుణాన్ని మంజూరు చేయటంలో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఆరోపించటంపై శనివారం నుంచి విపక్షాలు పార్లమెంట్ ను స్తంభింప జేస్తున్న సంగతి తెలిసిందే.