పైసా సాలరీ తీసుకోకుండా డ్యూటీ చేస్తారు!
పైసా సాలరీ తీసుకోకుండా డ్యూటీ చేస్తారు!
Published Sun, Jun 4 2017 6:59 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
దుబాయ్‌లో అతిత్వరలో కొత్త తరహా పోలీసులు విధుల్లో చేరబోతున్నారు. ఈ పోలీసులు ఒక్క రూపాయి కూడా సాలరీ తీసుకోకుండా 24 గంటలూ డ్యూటీ చేస్తారు. సంవత్సరం పొడవునా ఒక్క రోజు కూడా సెలవు పెట్టరు. ఇంతకూ ఆ పోలీసులు ఎవరంటే.. రోబో కాప్స్. దుబాయ్ నగరంలో ఇప్పటికే పెట్రోలింగ్ డ్యూటీలో చేరిపోయారు మరపోలీసులు. షాపింగ్‌మాల్స్ ముందు కాపలా కాస్తున్నారు. అలాగే పాత నేరస్తులను గుర్తించే పనిని చేపడుతున్నారు. రౌడీ మూకలతో ఫైటింగ్‌కు సై అంటున్నారు.
దుబాయ్ పోలీస్ డిపార్ట్‌మెంట్లో కొత్తగా చేరిన ఈ రోబో కాప్స్.. పోలీసులు చేసే అన్నిరకాల పనులు చేస్తాయట. అంతేకాదు పోలీసులు చేయలేని పనులు కూడా ఇవి చేస్తాయంటున్నారు. అదేమిటంటే ప్రజలతో మాట్లాడటం, పాత నేరస్థులను చూసిన వెంటనే గుర్తుపట్టి పోలీస్ స్టేషన్‌కు సంకేతాలు ఇవ్వడం, నేరం జరిగిన ప్రాంతంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరించడం
సిటీలో రద్దీ ప్రాంతాల్లో వీటిని పెట్రోలింగ్ విధుల్లో నియమిస్తామంటున్నారు దుబాయ్ పోలీసులు. ఇవి సంతృప్తికరంగా పనిచేస్తే 2030 వరకల్లా తమ పోలీస్ ఫోర్స్‌లో 25 శాతం ఇవే ఉండబోతున్నాయని చెప్తున్నారు. సంప్రదాయ పోలీస్‌ను పోలినట్లుగా ఉన్న ఈ రోబో కాప్స్ అచ్చం పోలీసుల్లాగానే సెల్యూట్ కూడా చేస్తాయి. షేక్‌హ్యాండ్ ఇస్తాయి. అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాయి. ఈ మర పోలీసుల ఛాతిభాగంలో ఉన్న టచ్‌స్క్రీన్ కంప్యూటర్ ద్వారా ఎవరైనా వీటితో మాట్లాడొచ్చు. ఏ విషయం గురించి అయినా ఫిర్యాదు చేయవచ్చు. నిద్రాహారాలు లేకుండా 24 గంటలూ డ్యూటీ చేయడమే కాదు.. సెలవు అడక్కుండా సంవత్సరం అంతా పని చేస్తూనే ఉండటం వీటి స్పెషాలిటీ. అందుకే వీటిపై మరిన్ని పరిశోధనలు జరిపి కొత్తకొత్త బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నారు అక్కడి పోలీసు అధికారులు.
Advertisement
Advertisement