రూఫ్ గార్డెన్‌తో లుక్కే వేరు! | roof garden shines house design | Sakshi
Sakshi News home page

రూఫ్ గార్డెన్‌తో లుక్కే వేరు!

Published Sat, Jan 18 2014 2:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రూఫ్ గార్డెన్‌తో లుక్కే వేరు! - Sakshi

రూఫ్ గార్డెన్‌తో లుక్కే వేరు!

సాక్షి, హైదరాబాద్: రూఫ్ గార్డెన్ ఇంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే ఈ రూఫ్ గార్డెన్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది నిపుణుల మాట.
 

  • ఇంటి పైకప్పు మీద తోట వేసి... ఓ అందమైన బృందావనాన్ని నిర్మించవచ్చు. ఆ బృందావనంలో కాస్త శ్రమిస్తే పూలు పూయించవచ్చు, పండ్లు కాయించవచ్చు.    
  • రూఫ్ గార్డెన్ నిర్మించాలనుకునే వారు అందుకు అవసరమైన ప్రణాళికను భవన నిర్మాణం చేపట్టిన నాటి నుంచే అమలు చేయాలి.    
  • రూఫ్ గార్డెన్‌తో భవనంపై బరువు పెరుగుతుంది. అందువల్ల పిల్లర్స్‌ను రూఫ్ గార్డెన్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలి. పిల్లర్లు మోయగలిగిన బరువు కంటే ఎక్కువ బరువైతే భవనానికి ముప్పే.
  •  పైకప్పుని చాలా పటిష్టంగా నిర్మించాలి. ఇది పటిష్టంగా లేకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • మొక్కల పెంపకానికి అవసరమైన మీడియం(మృత్తిక)ను రాళ్లులేని మట్టితో ఏర్పాటు చేస్తే మంచిది. కొంత ఒండ్రు మన్ను కలిపితే ఇంకా బాగుంటుంది.
  •  భవనం పైభాగాన్ని (రూఫ్ డెక్) చాలా పటిష్టంగా నిర్మించాలి. మొక్కల వేళ్లు, నీళ్లు ఇందులోకి ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి.
  •  మొక్కలకు పోసే నీరు రూఫ్ డెక్ సమీపంలోకి రాకుండా నిర్మించే డ్రైనేజీని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. ఈ డ్రైనేజీలో నీరు నిలిచినా, అది కిందికి ఇంకకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ కాంక్రీట్ లేయర్‌ను వేయాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement