ఏటీఎంలలో రూ.57 లక్షల చోరీ | Rs 57 lakh theft at ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎంలలో రూ.57 లక్షల చోరీ

Published Mon, Jul 13 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

Rs 57 lakh theft  at  ATM

నెల్లూరులో సీఎంఎస్ కస్టోడియన్ల చేతివాటం
 
నెల్లూరు (క్రైమ్): నగదు నిర్వహణ కస్టోడియన్లుగా పనిచేస్తోన్న ఇద్దరు వ్యక్తులు నెల్లూరులోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో రూ.57,10,400 మాయం చేసినట్లు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల సమాచారం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సీఎంఎస్ (క్యాష్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ) సంస్థ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే కాంట్రాక్టు తీసుకుంది.

ఆ సంస్థలో నెల్లూరు సంతపేట తూకుమానుమిట్టకు చెందిన కె.రోహిత్‌కుమార్, బోగోలుకు చెందిన కె.మహేంద్ర నగదు కస్టోడియన్లుగా పనిచేస్తున్నారు. వారు నెల్లూరులో ఐవోబీ, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు తదితర బ్యాంకులకు చెందిన 20 ఏటీఎంలలో రోజూ నగదు డిపాజిట్ చేసేవారు. ఆ ఏటీఎంలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు తెలిసిన నిందితులు కొంతకాలంగా 13 ఏటీఎంలలో నగదు కాజేయడం ప్రారంభించారు.  గమనించిన మరో కస్టోడియన్ కిరణ్‌కుమార్ ఈనెల తొమ్మిదిన సంస్థ ఏరియా మేనేజర్ జె.రంజిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రూ.57,10,400 అపహరణకు గురైనట్లు గుర్తించిన రంజిత్‌కుమార్ ఆదివారం ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement