ఆర్‌ఎస్ఎస్ కు అద్వానీ సలహా | RSS should include more women in its ranks, give leadership role: LK Adavni | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్ఎస్ కు అద్వానీ సలహా

Published Sun, Jan 15 2017 7:45 PM | Last Updated on Wed, Aug 29 2018 9:08 PM

ఆర్‌ఎస్ఎస్ కు అద్వానీ సలహా - Sakshi

ఆర్‌ఎస్ఎస్ కు అద్వానీ సలహా

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్(ఆర్‌ఎస్ఎస్)లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలని బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్ కే అద్వానీ సలహాయిచ్చారు. మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆధ్యాత్మిక సంస్థ ‘ప్రజాపిత బ్రహ్మకుమారీలు’  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాపిత బ్రహ్మకుమారీల సంస్థను అద్వానీ పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ సంస్థను ప్రేరణగా తీసుకుని మహిళలకు ప్రాతినిథ్యం పెంచాలని ఆర్ఎస్ఎస్ కు సూచించారు.

‘ఎన్నో ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ తో నాకు అనుబంధం ఉంది. స్వయంసేవక్‌ సంఘ్‌ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ప్రజాపిత బ్రహ్మకుమారీల నుంచి నేర్చుకోవాలని నన్ను కలిసిన ప్రతివారికి చెబుతాను. నా చిన్నతనంలో బాలురే ఎక్కువగా సంఘ్ లో చేరేవారు. బాలికల సంఖ్య చాలా తక్కువ. ఆర్ఎస్ఎస్ లో నేను యాక్టివ్ గా ఉండేవాడిన’ని అద్వానీ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement