శాంసంగ్ కొత్త గెలాక్సీలు వచ్చేశాయ్! | Samsung Galaxy A5, Galaxy A7 (2017) With 4G VoLTE Support, IP68 Rating Launched in India | Sakshi
Sakshi News home page

శాంసంగ్ కొత్త గెలాక్సీలు వచ్చేశాయ్!

Published Mon, Mar 6 2017 2:42 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

శాంసంగ్ కొత్త గెలాక్సీలు వచ్చేశాయ్!

శాంసంగ్ కొత్త గెలాక్సీలు వచ్చేశాయ్!

గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో తీవ్రంగా నష్టపోయిన దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, మరో రెండు కొత్త గెలాక్సీలతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వచ్చేసింది.  గెలాక్సీ ఏ5(2017), గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్ ఫోన్లను సోమవారం భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మొదట రష్యాలో లాంచ్ చేసిన అనంతరం నేడు భారత్ కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ5(2017) ధర రూ.28,990కాగ, గెలాక్సీ ఏ7(2017) ధర రూ.33,490. మార్చి 15 నుంచి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది.  నేటినుంచే ఈ స్మార్ట్ ఫోన్ల ప్రీబుకింగ్స్ శాంసంగ్ ఈ-స్టోర్, ఆఫ్ లైన్ రీటైలర్స్ ద్వారా కంపెనీ అందిస్తోంది.
 
బ్లాక్ స్కై, గోల్డ్ సాండ్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్7-స్టైల్డ్ డిజైన్ ఈ ఫోన్లకు ప్రత్యేక ఆకర్షణ. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగిన ఈ కొత్త ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఐపీ68-రేటింగ్స్ ను కలిగి ఉన్నాయి.   స్క్రీన్ సైజ్, బ్యాటరీ సామర్థ్యంలోనే ఈ రెండింటిలో అతిపెద్ద మార్పులు కనిపిస్తాయి. మిగతా స్పెషిఫికేషన్లలో పెద్దగా మార్పులేమి లేకుండా 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ సపోర్టుతో  ఈ ఫోన్లను కంపెనీ రూపొందించింది. 
 
గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్ ఫోన్ ఫీచర్లు 
డిస్ ప్లే : 5.20 అంగుళాలు
ప్రాసెసర్ : 1.9 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్
రెసల్యూషన్ :  1080x1920 పిక్సెల్స్
ర్యామ్ : 3జీబీ
స్టోరేజ్ : 32జీబీ
విస్తరణ మెమరీ : 256జీబీ వరకు
ఫ్రంట్ కెమెరా : 16 మెగాపిక్సెల్
రియర్ కెమెరా : 16 మెగాపిక్సెల్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 6.0
బ్యాటరీ : 3000 ఎంఏహెచ్
 
గెలాక్సీ ఏ7(2017) ఫీచర్లు : 
డిస్ ప్లే : 5.70 అంగుళాలు
ప్రాసెసర్ : 1.9 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్
రెసల్యూషన్ :  1080x1920 పిక్సెల్స్
ర్యామ్ : 3జీబీ
స్టోరేజ్ : 32జీబీ
విస్తరణ మెమరీ : 256జీబీ వరకు
ఫ్రంట్ కెమెరా : 16 మెగాపిక్సెల్
రియర్ కెమెరా : 16 మెగాపిక్సెల్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 6.0
బ్యాటరీ : 3600 ఎంఏహెచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement