లేటు వయస్సులో నటుడి ఐదో పెళ్లి!
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' స్టార్ సీన్ బియాన్ మరోసారి పెళ్లి కొడుకు అయ్యాడు. 58 ఏళ్ల ఈ హాలీవుడ్ నటుడు తాజాగా ఐదోసారి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రియురాలైన 38 ఏళ్ల ఆష్లే మూర్‌ను వివాహమాడాడు. బియాన్ గతంలో డెబ్రా జేమ్స్, మెలానీ హిల్, అబిగెయిల్ క్రుటెండన్, జార్జినా సక్లిఫ్‌లను మనువాడారు. కానీ ఈ నలుగురితో ఆయన వివాహబంధం ఎక్కువకాలం నిలువలేదు. ఆయనకు రెండో భార్యతో ఇద్దరు కూతుళ్లు, మూడో భార్యతో ఒక కూతురు ఉన్నారు. తాజాగా జరిగిన ఈ ఐదో వివాహ వేడుక అత్యంత సన్నిహితుల నడుమ అట్టహాసంగా జరిగిందని హాలీవుడ్ మీడియా తెలిపింది.
సీన్ బియాన్ పలు హాలీవుడ్ సినిమాల్లో నటించాడు. 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' చిత్రంలో బోరోమిర్‌గా కనిపించిన అతను 'గేమ్స్ ఆఫ్ ది థ్రోన్స్' సిరీస్‌లో నెస్డ్ స్టార్క్ పాత్రతో ప్రఖ్యాతి పొందాడు. త్వరలో రానున్న 'ద ఫ్రాంకెన్‌స్టీన్ క్రోనికల్స్'లో జాన్ మార్లట్ పాత్రలో కనిపించనున్నాడు.