
మరో అమెరికన్ జర్నలిస్టుకూ శిరచ్ఛేదం!
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) మిలిటెంట్లు తమ చెరలో ఉన్న రెండో అమెరికన్ జర్నలిస్టు స్టీవెన్ సోల్టాఫ్‌కు శిరచ్ఛేదం ....
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) మిలిటెంట్లు తమ చెరలో ఉన్న రెండో అమెరికన్ జర్నలిస్టు స్టీవెన్ సోల్టాఫ్‌కు శిరచ్ఛేదం చేస్తున్నప్పుడు తీసినదిగా పేర్కొంటూ ఓ వీడియోను ‘అమెరికాకు రెండో హెచ్చరిక’ పేరుతో మంగళవారం విడుదల చేశారు. ‘ఇరాక్‌లో అమెరికా జోక్యానికి మూల్యం చెల్లించుకుంటున్నా’ అని సోల్టాఫ్ చెబుతున్నట్లు వీడియోలో ఉంది. తమ వద్ద బందీగా ఉన్న బ్రిటన్ పౌరుడు డేవిడ్ హైన్స్‌ను కూడా చంపేస్తామని మిలిటెంట్లు ఇందులో హెచ్చరించారు. మరో జర్నలిస్టు జేమ్స్ ఫొలేను ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు తలనరికి చంపి, ఆ దృశ్యాల వీడియోను గత నెల విడుదల చేయడం తెలిసిందే.