కాంగ్రెస్ పార్టీకి షాక్‌ | Senior Uttarakhand Congress leader and state minister Yashpal Arya joins BJP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీకి షాక్‌

Published Mon, Jan 16 2017 12:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్ పార్టీకి షాక్‌ - Sakshi

కాంగ్రెస్ పార్టీకి షాక్‌

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మంత్రి యశ్‌పాల్‌ ఆర్య బీజేపీలో చేరారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఒకే విడతలో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్య కాంగ్రెస్ను వీడటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement