ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో మొదలైనా ప్రస్తుతం సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 27394 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించి 8,464 వద్ద ట్రేడవుతున్నాయి.ప్రధాన సూచీలు కూడా ఇదే ఊగిసలాటల మధ్య ఉన్నాయి. మరోవైపు జీఎస్‌టీ ఎఫెక్ట్తో పొగాకు సంబంధ కంపెనీలు ముఖ్యంగా ఐటీసీ భారీ లాభాలను ఆర్జిస్తోంది. వస్తు, సేవల పన్ను బిల్లులో పొగాకు ఉత్పత్తులపై భారీ పన్ను అంచనాలకు తెరపడటంతో ఇండెక్స్ హెవీవెయిట్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ టాప్ గెయినర్ గా ఉంది. ఈ బాటలో వీఎస్‌టీ కూడా పయనిస్తోంది. అయితే ఫార్మా పతనం మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.అలాగే ఆటో, రియల్టీ రంగాలు నష్టాల్లోఉన్నాయి. సన్ ఫార్మా టాప్ లూజర్ గా నిలవగా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, సిప్లా, మారుతీ, టాటా మోటార్స్ రెడ్ లోనే, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, గెయిల్, ఐసీఐసీఐ, బీవోబీ, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్ గ్రీన్ లోనూ ట్రేడ్ అవుతున్నాయి.
అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి 4 పైసల లాభంతో 66.71 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా.37 రూపాయలనష్టంతో రూ.30,450 వద్ద ఉంది.
ఐటీసీ మెరుపులు, ఫార్మాపతనం
Published Fri, Nov 4 2016 10:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
Advertisement