బలపడిన రూపాయి, సెన్సెక్స్ లాభాలు ఆవిరి!
బలపడిన రూపాయి, సెన్సెక్స్ లాభాలు ఆవిరి!
Published Mon, Sep 16 2013 5:08 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
రిజర్వు బ్యాంకు చేపట్టనున్న త్రైమాసిక ద్రవ్య సమీక్ష, యూఎస్ ఫెడ్ రిజర్వు సమావేశంతోపాటు, ద్రవ్యోల్బణం పెరుగుదల అంశాలు ఆరంభంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు సాధించిన లాభాలను ఆవిరి చేశాయి. ద్రవ్యోల్బణం పెరిగినందున ఆర్ బీఐ వడ్డీ రేట్లలో కోత విధించకపోవచ్చనే అనుమానాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేపట్టారు. దాంతో సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో 350 పాయింట్లు కోల్పోయింది. ఓ దశలో సెన్సెక్స్ 20086 పాయింట్ల ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. సోమవారం మార్కెట్ లో ముగింపులో 19742 పాయింట్లు వద్ద క్లోజైంది. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 5840 వద్ద ముగిసింది.
సోమవారం నాటి మార్కెట్ లో ఇండెక్స్ షేర్లలో బీపీసీఎల్ అత్యధికంగా 4 శాతం లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
రాన్ బాక్సీ అత్యధికంగా 30 శాతం నష్టపోగా, భెల్ 5 శాతం, హెచ్ సీఎల్ టెక్, అల్ట్రా టెక్ సిమెంట్, సెసా గోవా కంపెనీల షేర్లు 4 శాతానికి పైగా నష్టపోయాయి.
బులియన్ మార్కెట్ లో బంగారం 588 రూపాయలు నష్టపోయి 29540 వద్ద, వెండి 1396 రూపాయలు క్షీణించి 49280 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ద్రవ్య మార్కెట్ లో డాలర్ తో పోల్చితే రూపాయి 71 పైసలు బలపడి 62.70 వద్ద ట్రేడ్ అవుతోంది.
Advertisement