సెన్సెక్స్ కు 216 పాయింట్ల నష్టం!
డాలర్ తో పోల్చితే రూపాయి బలహీనపడటం, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ప్రతికూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 216 పాయింట్ల నష్టంతో 19781 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 5850 వద్ద ముగిసాయి. గత ఆరు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోవడం ఇదే తొలిసారి.
ఇక అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ తో పోల్చితే రూపాయి 12 పైసలు క్షీణించి 63.50 వద్ద ముగిసింది.
టాటాపవర్, ఐడీఎఫ్ఎసీ, ఐటీసీ, గెయిల్, రాన్ బాక్సీ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, జయప్రకాశ్ అసోసియేట్స్ అత్యధికంగా 11 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్, భెల్, టాటా స్టీల్, హీరో మోటో కార్ప్ లు 4 శాతానికి పైగా నష్టపోయాయి.