జైపూర్: స్వైన్ ప్లూ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. స్వైన్ ప్లూతో రాజస్థాన్ లో ఏడుగురి మృతి చెందారు. మరో 19 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. బన్స్ వారా, బార్మర్, టోంక్, కోటా, జైపూర్ ప్రాంతాలకు చెందిన వారు మృతుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు.
జైపూర్, సికార్, టోంక్, కోటా, ఇతర జిల్లాలో స్వైన్ ప్లూ కేసులు నమోదయినట్టు వెల్లడించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యాధికారులకు అప్రమత్తం చేసింది.
స్వైన్ ప్లూతో రాజస్థాన్ లో ఏడుగురి మృతి
Published Wed, Jan 14 2015 9:26 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM
Advertisement
Advertisement