కొత్త బాధ్యత తీసుకోమన్నారు: పారికర్
పనాజీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి ఖాయమైందన్న విషయాన్ని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పరోక్షంగా వెల్లవించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వజూపిన కొత్త బాధ్యతను అంగీరించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనను కోరారని ఆయన వెల్లడించారు. అయితే రక్షణ మంత్రి పదవే ఇవ్వజూపారా, లేదా అనేది ఆయన స్పష్టం చేయలేదు.
గోవా ఎమ్మెల్యేలు, బీజేపీ ఆఫీసు బేరర్లతో చర్చించిన తర్వాతే కేంద్ర మంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటానని పారికర్ తెలిపారు. ఆదివారం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పారికర్ కు రక్షణ మంత్రి పదవి ఇస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.