రాసలీలల గవర్నర్ రాజీనామా.. ఆమోదం
రాసలీలల గవర్నర్ రాజీనామా.. ఆమోదం
Published Fri, Jan 27 2017 4:04 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
మేఘాలయ గవర్నర్ వి. షణ్ముఖనాథన్ (67) చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తక్షణం ఆమోదించారు. రాజ్‌భవన్‌ను యంగ్ లేడీస్ క్లబ్‌గా, తన రాసలీలల కేంద్రంగా మార్చారంటూ ఆ కార్యాలయ ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ముఖ్యమంత్రికి లేఖ రాయడం, షణ్ముఖనాథన్ వైఖరిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు.
అయితే షణ్ముఖనాథన్ అటు మేఘాలయతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ రెండు రాష్ట్రాలకు కొత్తగా ఇన్‌చార్జి గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న పి.బి. ఆచార్యను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే అసోం గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్‌ను మేఘాలయకు ఇన్‌చార్జులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు.
Advertisement
Advertisement