Meghalaya Governor
-
నచ్చని వాళ్లు ఉత్తర కొరియాకు వెళ్లిపోవచ్చు
షిల్లాంగ్ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ శుక్రవారం వివాదాస్పద ట్వీట్ చేశారు. అలాంటి వారు నార్త్ కొరియాకు వెళ్లిపోవచ్చని సూచించారు. పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. రెండు వాస్తవ విషయాలను వివాదాస్పదంగా ఎప్పుడూ చూడకూడదు. 1. దేశ విభజన మతం కారణంగా జరిగింది. 2. విభజిత ప్రజాస్వామ్యం ఈ దేశానికి అవసరం. ఈ రెండింటిపై ఎవరైనా విభేదిస్తే వారు నిరభ్యంతరంగా ఉత్తర కొరియాకు వెళ్లొచ్చు అని ట్వీట్ చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన నిరసనకారులు రాజభవన్ను ముట్టడించడానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలను దాటి లోపలికి ప్రవేశించాలని యత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ జరిపారు. అనంతరం టియర్ గ్యాస్‌ను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులతో పాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. Two things should never be lost sight of in the present atmosphere of controversy. 1. The country was once divided in the name of religion. 2. A democracy is NECESSARILY DIVISIVE. If you don’t want it go to North Korea. — Tathagata Roy (@tathagata2) December 13, 2019 -
కశ్మీర్‌పై గవర్నర్ వివాదాస్పద ట్వీట్
సాక్షి, శ్రీనగర్ : రెండేళ్ల పాటు దేశ ప్రజలు ఎవరూ కశ్మీర్ వెళ్లొద్దని ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చేసిన ట్వీట్‌ను సమర్ధించి మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్మీ అధికారి తన ట్వీట్లో ‘రెండేళ్ళ పాటు భారతీయులు ఎవరూ కశ్మీర్ వెళ్ళొద్దు.. అమర్నాథ్కు వెళ్ళొద్దు.. కశ్మీర్ ఎంపోరియం నుంచి కశ్మీరీ వర్తకుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయొద్దు’. అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ రిటైర్డ్ అధికారిని సమర్థిస్తూ తథాగత రాయ్ ట్వీట్ చేశారు. ఇక గవర్నర్ తీరుపై నెటిజన్లతో పాటూ కశ్మీరీ నేతలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉండి ఇలాంటి ట్వీట్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశ పౌరుల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తథాగత రాయ్‌పై మండిపడ్డారు. ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. తథాగత రాయ్ వంటి వ్యక్తులు కశ్మీరీలు లేని కశ్మీర్ కావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. An appeal from a retired colonel of the Indian Army: Don’t visit Kashmir,don’t go to Amarnath for the next 2 years. Don’t buy articles from Kashmir emporia or Kashmiri tradesman who come every winter. Boycott everything Kashmiri. I am inclined to agree — Tathagata Roy (@tathagata2) February 19, 2019 Deplorable statement coming from the Governor of Meghalaya. GoI must sack him immediately . If they fail to do so, it means he has their tacit approval and are using it as an election ploy to polarise the situation. https://t.co/AQE0e1akUH — Mehbooba Mufti (@MehboobaMufti) February 19, 2019 People like Tathagata want Kashmir but without Kashmiris. They’d sooner see us driven in to the sea. He’ll be best placed to know he can’t have one without the other so what’s it to be? https://t.co/BS1zAG78Xx — Omar Abdullah (@OmarAbdullah) February 19, 2019 -
అతికి ఎవరు అతీతులు కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : మేఘాలయ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్ హిందీలో ప్రసంగించడం వల్ల పలు వర్గాల నుంచి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. మనం బతుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పొరపాటు పడడం లేదా తప్పుగా అర్థం చేసుకోవడం అత్యంత సహజం. అందుకనే ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుంచి పరిశీలించి విశ్లేషించాల్సి ఉంటుంది. గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉపయోగించే ఇంగ్లీషు భాషను కాదని ఉద్దేశపూర్వకంగానే హిందీ భాషలో మాట్లాడారా? అలా అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే మేఘాలయ, ముఖ్యమంత్రి ఈశాన్య రాష్ట్రాలు తమ భాషా, సంప్రదాయాలకు ఇచ్చే ప్రాధాన్యతను గుర్తించడంలో మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్ విఫలమయ్యారని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అలాంటప్పుడు ఇది అమాయకత్వంతో జరిగిన పొరపాటా? ఏమో కావచ్చు! కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. హిందీ రాష్ట్రాల్లో ప్రాబల్యం కలిగిన ఆ పార్టీ జాతీయ భాషగా హిందీని నిర్బంధం చేయాలని యోచిస్తున్న విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో తమకు అనుకూలంగా గవర్నర్లను ఉపయోగించిన విషయం కూడా అనుభవ పూర్వకమే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ హిందీలో మాట్లాడారన్నది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒకే దేశం, ఒకే గుర్తింపు, ఒకే భాష అన్న నినాదంతో బీజేపీ లబ్ధి పొందాలనుకుంటోందన్నది కాంగ్రెస్ వాదన. గవర్నర్ హిందీలో మాట్లాడినంత మాత్రాన స్థానిక భాష కూడా హిందీ అవుతుందా? రాష్ట్రం కాషాయం పులుపుకుంటుందా? రాష్ట్ర గవర్నర్‌కు ఇంగ్లీషుకన్నా హిందీలోనే అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం ఉందేమో! ప్రభుత్వ పాలన, ప్రజల సాధికారత, పారదర్శక ప్రాధాన్యత గురించి ప్రతిపక్షం పాలకపక్షాన్ని నిలదీస్తే బాగుంటుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకత్వాన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన రోజున ఆ పార్టీ జెండాలకన్నా రాష్ట్రంలో ఎక్కడ చూసిన బీజేపీ జెండాలే కనిపించాయి. 60 సీట్లుగల రాష్ట్ర అసెంబ్లీలో కేవలం రెండు సీట్లు సాధించిన బీజేపీ చాలా అతి చేసిందని, బ్రాండ్ ఇమేజ్‌కు బాగా బాకా ఊదేందుకు ప్రయత్నించిందంటూ సోషల్ మీడియాలో ఫొటోలతో విమర్శలు వెల్లువెత్తాయి. అతికీ ఎవరతీతులు? -
'రాసలీలల' గవర్నర్ రాజీనామాకు ముందు..!
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూనే.. పీఏకు ప్రమోషన్ ఇచ్చిన వైనం రాజ్‌భవన్ కేంద్రంగా లైంగిక కార్యకలాపాలు జరిపారన్న ఆరోపణలతో మేఘాలయ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన వీ షణ్ముగనాథన్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షణ్ముగనాథన్పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో.. కేంద్రం ఆదేశాల మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తన పీఏ (పర్సనల్ అసిస్టెంట్)గా ఉన్న ఓ మహిళకు ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో)గా ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళను గవర్నర్ స్వయంగా ఇంటర్వ్యూ చేయడమే కాదు.. నిబంధనలు పక్కకుతోసేసి.. తన రాజీనామాకు ముందే ఈ పదోన్నతి కల్పించారు. ఈ పోస్టు కోసం ఇంటర్వ్యూకు హాజరైన ఇతర అభ్యర్థులు కూడా గవర్నర్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులు ఇంటర్వ్యూ చేసిన తర్వాత గవర్నర్ తమకు ఫోన్ చేసి.. 'వన్ టు వన్ ఇంటర్వ్యూ' చేశారని పేర్కొన్నారు. 2016 మార్చిలో గవర్నర్‌కు పీఏగా నియమితులైన మహిళనే.. డిసెంబర్ 7న పీఆర్వోగా గవర్నర్ తిరిగి నియమించుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. పీఏగా ఉన్నప్పుడు ఆమెకు రూ. 6500 నుంచి 12,700 వరకు వేతనం ఉండగా, పీఆర్వోగా నియమితులైన తర్వాత నెలకు రూ. 30వేల జీతాన్ని నిర్ణయించారు. 'వన్ టు వన్ ఇంటర్వ్యూ' పేరిట తనతో గవర్నర్ అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళా అభ్యర్థి తనతో చెప్పినట్టు ఈ పోస్టుకు దరఖాస్తు చేసిన మరో మహిళా అభ్యర్థి తెలిపారు. ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకు తనను పిలువలేదని, కానీ ఈ ఇంటర్వ్యూ కోసం ఇద్దరు మహిళా అభ్యర్థులకు గవర్నర్ స్వయంగా ఫోన్ చేశారని ఆమె చెప్పారు. -
రాసలీలల గవర్నర్ రాజీనామా.. ఆమోదం
మేఘాలయ గవర్నర్ వి. షణ్ముఖనాథన్ (67) చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తక్షణం ఆమోదించారు. రాజ్‌భవన్‌ను యంగ్ లేడీస్ క్లబ్‌గా, తన రాసలీలల కేంద్రంగా మార్చారంటూ ఆ కార్యాలయ ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ముఖ్యమంత్రికి లేఖ రాయడం, షణ్ముఖనాథన్ వైఖరిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. అయితే షణ్ముఖనాథన్ అటు మేఘాలయతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ రెండు రాష్ట్రాలకు కొత్తగా ఇన్చార్జి గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న పి.బి. ఆచార్యను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే అసోం గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్‌ను మేఘాలయకు ఇన్చార్జులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. -
మేఘాలయ గవర్నర్ రాసలీలలు!
విమర్శల వెల్లువ.. ఆపై రాజీనామా ► రాజ్‌భవన్ ను ‘యంగ్ లేడీస్ క్లబ్’గా మార్చారంటూ ఉద్యోగుల లేఖ షిల్లాంగ్: మేఘాలయ గవర్నర్ వీ షణ్ముఖనాథన్ (67) గురువారం రాజీనామా చేశారు. రాజ్‌భవన్ ను యంగ్ లేడీస్ క్లబ్‌గా, తన రాసలీలల కేంద్రంగా మార్చారంటూ ఆ కార్యాలయ ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రహోంమంత్రి, ముఖ్యమంత్రికి లేఖ రాయడం, షణ్ముఖనాథన్ వైఖరిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ షణ్ముఖనాథన్ రాజ్‌భవన్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, రాజ్‌భవన్ ను ‘యంగ్ లేడీస్ క్లబ్’గా మారుస్తున్నారని, సత్వరమే ఆయనకు ఉద్వాసన పలకాలని కోరుతూ దాదాపు వంద మంది రాజ్‌భవన్ ఉద్యోగులు రాష్ట్రపతి ప్రణబ్‌కు, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాకు లేఖ రాశారు. ‘రాజ్‌భవన్ కు యువతులు యథేచ్ఛగా వచ్చి వెళ్తుంటారు. వారిలో చాలా మంది గవర్నర్ బెడ్రూమ్లోపలి వరకు డైరెక్ట్‌గా వెళ్తుంటారు. గవర్నర్ ఇద్దరు ప్రజాసంబంధాల అధికారులను, ఒక కుక్‌ను, రాత్రి విధుల కోసం ఒక నర్స్‌ను ప్రత్యేకంగా నియమించుకున్నారు. వారంతా మహిళలే. తన దగ్గర విధులు నిర్వహించేందుకు యువతులను మాత్రమే నియమించుకున్నారు. అధికారిక ప్రైవేటు కార్యదర్శిని సైతం తన సెక్రటేరియట్‌కు బదిలీ చేశారు’ అని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. గవర్నర్ వైఖరిపై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. రాజ్‌భవన్ కు ఉద్యోగం కోసం వెళ్లగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ షణ్ముఖనాథన్ పై ఒక యువతి గతంలో ఆరోపణలు కూడా చేశారు. 2015లో షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన షణ్ముఖనాథన్ గతంలో ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉన్నారు.